విశాఖ ఆర్‌కే బీచ్‌లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పర్యటన

రిపోర్టర్: హరి స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. సాగర స్వచ్ఛతను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. సముద్ర వ్యర్థాల సేకరణపై మత్స్యకారులు, స్కూబా డైవర్లతో ముఖాముఖి నిర్వహించారు. అలాగే బీచ్‌లో మురి మిక్చర్ విక్రయించే ఒంటరి మహిళకు పింఛన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.