జీవో 76 పట్టాల జాప్యంపై పెల్లుబికిన పేదల ఆక్రోశం
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలో జీవో 76 కింద చలానాలు చెల్లించినప్పటికీ పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఎంసిపిఐయు నాయకులు మండిపడ్డారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ అప్పులు తెచ్చి చలానాలు కట్టినా నేటికీ పట్టాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ పట్టాలను పంపిణీ చేయాలని, లేనిచో పెద్దఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.