రాజకీయ నిరసనలు ప్రేరేపిస్తే కోచింగ్ కేంద్రాలపై చర్యలు: సీఎం చంద్రబాబు
రిపోర్టర్: రమేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాజకీయ ఆందోళనల్లో పాల్గొనేలా అభ్యర్థులను ప్రేరేపించే కోచింగ్ కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజకీయ కుట్రలకు ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు వేదిక కాకూడదని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థులు ఒత్తిళ్లకు లోనుకాకుండా పోటీ పరీక్షలపై దృష్టి సారించాలని కోరారు. మరోవైపు ఏలూరు కార్మిక శాఖలో నిధుల దుర్వినియోగంపై ఎనిమిది మంది అధికారులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది.