వరంగల్ ఎంజీఎం దవాఖానలో పైకప్పు పెచ్చులు ఊడిపడి ముగ్గురికి గాయాలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: వరంగల్
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడిపడి పక్షవాత వ్యాధితో చికిత్స పొందుతున్న మస్తాన్ (55)తో పాటు అటెండర్లు ఎల్లమ్మ (50), ఓంకార్ (33)లకు తీవ్ర గాయాలయ్యాయి. జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన బాధితులకు ఆసుపత్రి వైద్యులు తక్షణ చికిత్సనందిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానాలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.