'బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్': హాలీవుడ్ చిత్రం స్పైడర్ మ్యాన్ ఘనత

రిపోర్టర్: కిరణ్ స్థలం: World

టామ్ హోలాండ్ ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ చిత్రం 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. 2015 నాటి 'స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్' రికార్డును అధిగమించి ఈ సినిమా నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 47 రోజుల్లోనే దాదాపు 93.67 కోట్ల డాలర్ల వసూళ్లను రాబట్టి ఈ అరుదైన ఘనతను సాధించగా, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 2.45 బిలియన్ డాలర్ల వసూళ్లతో అగ్రస్థానాల దిశగా దూసుకెళ్తోంది.