కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
రిపోర్టర్: శివ
స్థలం: సిద్దిపేట
హరీష్ రావు ఆఫీస్ వెల్లడించిన వివరాల ప్రకారం, కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు రాసిన లేఖతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అనంతగిరి మరియు రంగనాయక సాగర్ రిజర్వాయర్లలోకి ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేసే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. ఈ పరిణామంతో సిద్దిపేట ప్రాంతంలోని ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తమవుతుండగా, తాజా చర్యలపై స్థానిక రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.