హాలీవుడ్ లో సత్తా చాటుతున్న తెలుగు హీరో మహేశ్ శ్రీరామ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఇండియా

తెలుగు నటుడు మహేశ్ శ్రీరామ్ హాలీవుడ్ చిత్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆయన నటించిన 'కౌబాయ్ అండ్ ఇండియన్' సినిమా రేపు గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో విజయ్ అనే కీలక పాత్రలో ఆయన కనిపించనున్నారు. మరోవైపు వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో కేథరీన్ ట్రెసాతో కలిసి ఆయన నటిస్తున్న 'ఫణి' గ్లోబల్ ప్రాజెక్ట్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.