వికసిత్‌ భారత్ లక్ష్య సాధనే ధ్యేయంగా ఏపీ అస్సాం అధ్యయన పర్యటన

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు, ఉత్తమ విధానాల పరస్పర మార్పిడి కీలకమని 20 సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మన్‌ లంకా దినకర్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌- అస్సాం అధ్యయన పర్యటనలో భాగంగా గువాహటిలో గురువారం నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన వంటి పది ప్రాధాన్యాలతో ఏపీ ముందుకెళ్తోందని ఆయన స్పష్టం చేశారు.