ఘజియాబాద్‌లో లిఫ్ట్‌లో కుక్క విషయంలో మహిళల మధ్య ఘర్షణ
రిపోర్టర్: విజయ్
స్థలం: Uttar Pradesh
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో హైరైజ్ సొసైటీ లిఫ్ట్‌లో కుక్కను తీసుకెళ్లే విషయంలో ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విండ్సార్ ప్యారడైజ్ సొసైటీలో లిఫ్ట్ ఎక్కే విషయంలో స్కూలు టీచర్ హీనా బారీపై శ్వేతా దూబే అనే మహిళ కుక్కను నియంత్రించే కర్రతో దాడి చేసింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.