తెలంగాణలో మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ వేడుకలు
రిపోర్టర్: రమేష్
స్థలం: తెలంగాణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు వెల్లడించారు. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్, ఉచిత వైద్య శిబిరాలు వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టి, మోదీ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయనున్నట్లు ఆయన తెలిపారు.