కాట్రేవులో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలంలోని కాట్రేవు గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ దేవి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సహస్ర ఫౌండేషన్ అధ్యక్షులు చినుకని యువరాజుతో పాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బచ్చ కిష్టయ్య, బద్దం రాజయ్య తదితరులు ఈ వేడుకల్లో ఘనంగా పాల్గొన్నారు.