క్రీడలను రాజకీయాల్లోకి లాగడం తగదంటూ పెద అప్పలరాజు ఫైర్

రిపోర్టర్: సతీష్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళంలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ పెద అప్పలరాజు తీవ్రంగా మండిపడ్డారు. దొంగ మాటలు మాట్లాడడం తమకు రాదని, తమకు తెలిసిందల్లా ఆటలేనని స్పష్టం చేశారు. క్రీడలను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో తన గుర్తింపు ఏమిటో అందరికీ తెలుసని, గొడ్డలి బ్యాచ్ చేస్తోన్న తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనించాలని ఆయన హితవు పలికారు.