రాజకీయ కక్షతోనే తమ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ వైసీపీ నేత వాకాటి ఆవేదన

రిపోర్టర్: AHMED స్థలం: పొదలకూరు

నెల్లూరు జిల్లా పొదలకూరులో ఎన్నికల వేళ తమ కుటుంబాన్ని రాజకీయ కక్షతో వేధిస్తున్నారని వైసీపీ నాయకుడు వాకాటి శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. రుస్తుం మైన్ కేసులో పోలీసులు నోటీసులు జారీ చేశారని, చట్టాన్ని గౌరవిస్తూ డీఎస్పీ ఎదుట హాజరవుతానని తెలిపారు. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేస్తూ దంపతులు మీడి ముందర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.