సిలబస్ సవరణపై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో వివిధ ఉద్యోగ నియామకాల సిలబస్ సవరణపై వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో టీజీపీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది. సిలబస్ సవరణ కోసం ఎలాంటి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయలేదని కమిషన్ స్పష్టం చేసింది. సిలబస్లో ప్రధాన మార్పులను ఒక సంవత్సరం ముందే అభ్యర్థులకు తెలియజేస్తామని, స్వల్ప మార్పులను నోటిఫికేషన్తో పాటే విడుదల చేస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి వెబ్నోట్లో పేర్కొన్నారు.