ఘనంగా ఆనం లీలా కైవల్య రెడ్డి జన్మదిన వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఏఎస్పేట
ఏఎస్పేట మండలంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు ఆనం లీలా కైవల్యా రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిడిపి మండల అధ్యక్షులు రమేష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో బాణాసంచా కాల్చి, భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యనిర్వాహక కార్యదర్శి రహమత్ నవాజ్, నాయకులు షకీల్, రషీద్, షానూర్, జాకీర్, మునిం భాష, అఫ్రిది, ఫరీద్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.