సినీ నటుడు చిట్టిబాబుతో మంథని పాత్రికేయుల ఆత్మీయ భేటీ
రిపోర్టర్: Subhan.Manthani
స్థలం: మంథని
హాస్యబ్రహ్మ రాజబాబు సోదరుడు, ప్రముఖ నటుడు చిట్టిబాబును మంథని సీనియర్ పాత్రికేయుల బృందం హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. సినీ రంగ విశేషాలను ముచ్చటించిన అనంతరం, పాత్రికేయులకు ఆయన టిటిడి జ్ఞాపికలను అందజేసి తేనేటి విందు ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చిట్టిబాబుతో ఫోన్లో మాట్లాడారు. మంథనిలో త్వరలో జరగనున్న 'మహావాది సోదరుల' గాన కచేరీకి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమం స్థానిక సాంస్కృతిక రంగానికి మరింత ఊతమిస్తుందని పాత్రికేయులు ఆశాభావం వ్యక్తం చేశారు.