కాలుష్య నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి: అధికారులకు బీజేపీ విజ్ఞప్తి
రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు
స్థలం: తిరుపతి అర్బన్
తిరుపతిలో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న కాలుష్య సమస్యల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని బీజేపీ నాయకులు అధికారులను కోరారు. జనతా వారధి కార్యక్రమంలో అందిన ఫిర్యాదుల మేరకు వాయు, నీటి కాలుష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.