చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నీ: జోడీ బర్రేజ్ కు సోషల్ మీడియాలో తీవ్ర బెదిరింపులు

రిపోర్టర్: నరేష్ స్థలం: చెన్నై

చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నీలో తొలి రౌండ్ మ్యాచ్ ఓడిపోయిన బ్రిటన్ క్రీడాకారిణి జోడీ బర్రేజ్ తనకు సోషల్ మీడియాలో తీవ్రమైన మరణ బెదిరింపులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆన్లైన్ వేధింపుల స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో ఆమె పంచుకున్నారు. క్రీడాకారుల రక్షణ కోసం ప్లాట్ఫారమ్లు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జోడీ బర్రేజ్ ప్రశ్నించినట్లు డబ్ల్యూటీఏ అధికారులు తెలిపారు.