సింగరేణి కార్మికులకు తీపి కబురు: తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయం

రిపోర్టర్: సురేష్ స్థలం: భూపాలపల్లి

గైర్హాజరు కారణంగా గతంలో ఉద్యోగాలు కోల్పోయిన సింగరేణి కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని యాజమాన్యం నిర్ణయించిందని జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య తొలగించబడిన వారికి ఈ అవకాశం లభిస్తుందని, ఆసక్తి గల వారు ఈ నెల పద్నాలుగో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.