రాప్తాడులో దారుణం: పాఠశాలలో టెన్త్ విద్యార్థినిపై రంపంతో ఉన్మాది భీకర దాడి

రిపోర్టర్: సునీల్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న గోపిక అనే విద్యార్థినిపై హేమంత్ అనే ఉన్మాది ఎలక్ట్రిక్ రంపంతో అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తరగతి గదిలోకి చొరబడి మెడ, ముఖంపై దాడి చేయడంతో బాధితురాలు తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.