నాపై నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే మాధవరం
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాపారాలపై తీవ్రంగా స్పందించారు. హైదర్‌నగర్ భూముల రిజిస్ట్రేషన్లపై మంత్రి సభను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. 22ఏ భూముల అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి రానిస్తే అన్ని ఆధారాలతో నిరూపిస్తానని, తాను చెప్పేది అబద్ధమైతే రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ విసిరారు.