అమెరికా ఎన్నికల్ లో రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ: భారతీయులపై విద్వేష ప్రచారంతోనే ఓటమి
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమెరికా
అమెరికాలో భారతీయులపై సాగిన విద్వేష ప్రచారం రిపబ్లికన్ పార్టీకి రాజకీయంగా పెద్ద దెబ్బ కొట్టిందని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. టెక్సాస్ ఎన్నికల్ లో రిపబ్లికన్ అభ్యర్థి బో ఫ్రెంచ్ ఓటమి ఈ చర్చకు బలం చేకూర్చిందని నిపుణులు తెలిపారు. హెచ్-వన్ బీ వీసాలు మరియు విద్యార్థులపై వ్యతిరేకత కారణంగా ఆసియా అమెరికన్ ఓటర్లు డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపారని, దీనివల్ల ఆ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు.