గువహతిలో కాంగ్రెస్ శ్రేణులపై పోలీసుల దాడి: రిపున్ బోరాకు తీవ్ర గాయాలు

రిపోర్టర్: నరేష్ స్థలం: గువహతి

గువహతిలోని రాజీవ్ భవన్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రిపున్ బోరాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఢిల్లీలో ప్రతిపక్ష ఎంపీలపై పోలీసుల చర్యను నిరసిస్తూ గురువారం చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్యాలయం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసు సిబ్బంది తమ నేతలపై అత్యుత్సాహం ప్రదర్శించారని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.