స్థానిక ఎన్నికల నేపథ్యంలో పలాసలో పోలీసులు భారీ రూట్ మార్చ్ నిర్వహణ
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాసలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు భారీ రూట్ మార్చ్ నిర్వహించారు. ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు కాశీబుగ్గ డీఎస్పీ జీవీ రమణ నేతృత్వంలో ఈ మార్చ్ సాగింది. ప్రజల్లో భద్రతా భావం కల్పించడంతో పాటు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే ఈ ప్రత్యేక కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.