టీబీ నిర్మూలనలో విశేష ప్రతిభ: నేలకొండపల్లి మండలానికి సిల్వర్ మెడల్ గర్వకారణం
రిపోర్టర్: kasanivenkatesh
స్థలం: నేలకొండపల్లి
ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన సదస్సులో నేలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామ పంచాయతీకి టీబీ ఫ్రీ పంచాయతీగా సిల్వర్ మెడల్ లభించింది. ఈ సందర్భంగా సర్పంచ్ కమదన ప్రవీణ్ మరియు ఆరోగ్య సిబ్బందిని డీటీవో డాక్టర్ నివేదిత ఘనంగా సత్కరించి అభినందించారు. టీబీ నిర్మూలన దిశగా గ్రామంలో అందిస్తున్న వైద్య సేవలను ఉన్నతాధికారులు కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.