ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ మృతి కేసులో ప్రొఫెసర్‌పై కేసు నమోదు
రిపోర్టర్: మహేష్
స్థలం: ముంబై
ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య కేసుకు సంబంధించి ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లాపై ఆత్మహత్యకు ప్రేరేపణ నేరం కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పరీక్షలో చాట్‌జీపీఐ వాడారనే ఆరోపణల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన సాహిల్ ఆత్మహత్య చేసుకున్నాడని, గత మూడు నెలలుగా తన కుమారుడిని కులవివక్షతో వేధించారని సాహిల్ తండ్రి రవీంద్ర చక్రధర్ వాంఖడే ఆరోపించారు. ఈ దర్యాప్తును ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.