విజయగరం జీజీహెచ్ లో మానసిక ఆరోగ్య విభాగం ద్వారా వ్యసనపరులకు కొత్త జీవితం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: విజయనగరం
విజయనగరం మహారాజా ప్రభుత్వాసుపత్రిలోని మానసిక ఆరోగ్య విభాగం ద్వారా వ్యసనాలకు బానిసైన వారికి ఉచిత వైద్యం, కౌన్సిలింగ్ అందిస్తున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ అల్లు పద్మజ వెల్లడించారు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే సాధారణ జీవితం సాధ్యమని ఆమె తెలిపారు. మద్యం, ఆన్లైన్ జూదం, మొబైల్ గేమ్స్ వంటి వ్యసనాలతో అనారోగ్యం బారినపడిన ఎంతోమందికి ఈ కేంద్రం కొత్త వెలుగులు తెచ్చిపెట్టిందని, బాధితులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.