మురసు తుఫాను బీభత్సం: జూలూరుపాడులో నేలకొరిగిన పంటలు, నిలిచిన రాకపోకలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: జూలూరుపాడు
మురసు తుఫాను కారణంగా జూలూరుపాడు మండలంలో భారీ వర్షాలు, ఈదురు గాలులకు వ్యవసాయం అతలాకుతలమైందని, మిర్చి, పత్తి పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఎడతెరిపిలేని వానలకు వాగులు ఉప్పొంగడంతో బేతాలపాడు, నర్సాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అప్పులు చేసి సాగు చేసిన పంటలు నీట మునగడంతో రైతన్నలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ భారీ నష్టాన్ని ప్రభుత్వం తక్షణమే అంచ వేసి ఆదుకోవాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.