రాజాపేటలో ఘనంగా జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రేణికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేత జూకంటి ప్రవీణ్ కుమార్ జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సహకార సంఘం సిబ్బంది మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.