సౌరవ్ దాస్ నేపథ్యంపై విచారణ కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు

రిపోర్టర్: సతీష్ స్థలం: చెన్నై

సౌరవ్ దాస్ నేపథ్యంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలైందని వ్యాపారవేత్త గణేష్ కుమార్ తెలిపారు. నేపాల్ మూలాలున్నాయనే ఆరోపణలపై కేంద్ర హోం శాఖ విచారణకు ఆదేశించాలని, ఆయన పాస్పోర్ట్ రద్దు చేయాలని పిటిషన్లో కోరినట్లు వెల్లడించారు. న్యాయవ్యవస్థను దూషిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన ఈ పిటిషన్పై స్పందించాలని కేంద్రానికి, ఇతర వర్గాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు.