నెక్కొండ కేంద్రంలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని స్థానికుల ఆవేదన

రిపోర్టర్: శేఖర్ స్థలం: నర్సంపేట

నెక్కొండ పట్టణంలోని తెలంగాణ సెంటర్లో రోడ్డుపై చెత్తాచెదారం భారీగా పేరుకుపోయింది. సమస్యపై పలుమార్లు గ్రామసభలో, సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఎలాంటి పరిష్కారం కాలేదని స్థానికులు తీవ్రంగా వాపోతున్నారు. సమీపంలోని వైన్స్ దుకాణం ముందు మాత్రమే పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రం చేస్తున్నారని, తమ నివాస ప్రాంతాలను మాత్రం పూర్తిగా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి రోడ్డును శుభ్రం చేయాలని కోరుతున్నారు.