మైనార్టీల సమస్యలపై ఐక్యంగా పోరాడాలి: తంజిమ్ ఎ ఇన్సాఫ్ పిలుపు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలని తంజిమ్-ఎ-ఇన్సాఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మహమ్మద్ సలాం పిలుపునిచ్చారు. ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముస్లింలకు రిజర్వేషన్లు, మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే వక్ఫ్ భూములు, మసీదులు, కబరస్తాన్ల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణమే పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. సీపీఐ నగర కార్యదర్శి జనిమియా మాట్లాడుతూ ఇన్సాఫ్ నిరంతర పోరాటాలతోనే సమస్యలు వెలుగులోకి వస్తున్నాయన్నారు.