వలసవాద ఆలోచనలతోనే ప్రపంచాన్ని విభజిస్తున్నారు: రష్యా అధ్యక్షుడు పుతిన్
రిపోర్టర్: మహేష్
స్థలం: న్యూఢిల్లీ
కొత్త ప్రపంచ వ్యవస్థను అడ్డుకోవడానికి కొన్ని దేశాలు వలసవాద ఆలోచనలతో కుట్రలు పన్నుతున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా మండిపడ్డారు. బ్రిక్స్ సదస్సులో ఆయన మాట్లాడుతూ, సుంకాలు, ఆంక్షలు, సైనిక బలంతో ఇతర దేశాలను అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల ఖర్చుతో బతుకుతూ ప్రపంచాన్ని వర్గాలుగా విడగొడుతున్నారని, ఈ దుర్నీతి అంతర్జాతీయ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆయన హెచ్చరించారు.