పెదబయలులో ఘనంగా 'మీ భూమి-మీ హక్కు' పట్టాల పంపిణీ

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: పెదబయలు

పెదబయలు మండలం, పెదకోడాపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఉర్రాడ గ్రామంలో 'మీ భూమి–మీ హక్కు' కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు పి.నాగేష్ ముఖ్య అతిథిగా హాజరై, అర్హులైన భూ యజమానులకు పట్టాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అప్పారావు, మాజీ సర్పంచ్ చిట్టిబాబు, స్థానిక నాయకులు, వీఆర్వో రామకృష్ణ, సర్వేయర్ హరీష్ పాల్గొన్నారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.