డ్యాన్సర్స్ అసోసియేషన్ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత సుమలతా దేవి ఫిర్యాదు
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఇందిరానగర్లో జరిగిన తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రికార్డులు అక్రమంగా తీసుకెళ్తుండగా అడ్డుకున్న తనపై కొందరు దాడి చేసి బెదిరించారని అసోసియేషన్ అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.