సరుబుజ్జిలి మండలంలో జోరుగా సాగుతున్న కూటమి స్థానిక అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సరుబుజ్జిలి

సరుబుజ్జిలి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. జడ్పీటీసీ కూటమి అభ్యర్థి సింగుపురపు దివ్య, ఎంపీటీసీ అభ్యర్థి కుప్పిలి లలిత ఆధ్వర్యంలో షలంత్రి, మర్రిపాడు, బురిడివలస గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకొని సమస్యలు అడిగి తెలుసుకుంటూ కూటమి విజయానికి మద్దతు కోరారు.