జర్నలిస్టులకు తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతల డిమాండ్

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రత్యేక జీవో ద్వారా ఇళ్ల స్థలాలు కేటాయించాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిజాంపేటలో జేఎన్జే సొసైటీ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అన్యాయమని వారు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వారు కోరారు.