హర్యానా బోర్డు పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల: ఉత్తీర్ణత శాతం వెల్లడి

రిపోర్టర్: సునీల్ స్థలం: హర్యానా

హర్యానా స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను నవంబర్ ఆరున విడుదల చేసినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్య జరిగిన ఈ పరీక్షలకు ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది విద్యార్థులు హాజరుకాగా, ఐదు వేల రెండు వందల ముప్ పై రెండు మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మొత్తం ఉత్తీర్ణత శాతం అరవై ఆరు శాతంగా నమోదు కాగా, విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా స్కోర్ కార్డ్ లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు.