అమెరికాలో సంచలనం: కన్సాస్ ఎన్నికల్ లో తొంబై నాలుగు ఏళ్ల రికార్డ్ బద్దలు

రిపోర్టర్: నరేష్ స్థలం: Kansas

అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి ఆదం హమిల్టన్ చారిత్రక విజయం సాధించారని ఎన్నికల వర్గాలు వెల్లడించాయి. సుమారు తొంబై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రిపబ్లికన్ రాష్ట్రంలో డెమొక్రాట్ విజయం సాధించడం తీవ్ర రాజకీయ కలకలం రేపింది. వాషింగ్టన్ తీరుపై ఓటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రిపబ్లికన్లు మరియు స్వతంత్రుల మద్దతుతోనే ఈ అద్భుత విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు.