విజయవాడలో డిజిటల్ అరెస్ట్ మోసం: బాధితుడి ఖాతాలోకి ఏడు కోట్ల నిధులు

రిపోర్టర్: గోపి స్థలం: విజయవాడ

విజయవాడలో జరిగిన భారీ డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసంలో బాధితుడైన ఎనుబది ఒకేళ్ల వృద్ధుడికి భారీ ఊరట లభించిందని పోలీసులు వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు భయపడి ఆయన పది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు పోగొట్టుకోగా, పోలీసుల అప్రమత్తతతో ఏడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు తిరిగి ఆయన బ్యాంకు ఖాతాకు చేరాయి. మిగిలిన నిధుల కోసం దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.