తుఫాను ముప్పు హెచ్చరిక: శ్రీకాకుళంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ల ఏర్పాటు

రిపోర్టర్: రాజేష్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలో తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలకు తక్షణ సహాయం, సమాచారం అందించేందుకు కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్రీకాకుళం వెల్లడించారు. అత్యవసర సహాయం కోసం జిల్లా కలెక్టరేట్ 08942-240557 నంబరును సంప్రదించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులు ఇచ్చే సూచనలను విధిగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.