ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం: సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం

రిపోర్టర్: హరి స్థలం: Guntur

పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో పైలట్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో వంద, గుంటూరు గ్రామీణ పరిధిలో డెబ్బై ఏడు ఇళ్లను అత్యాధునిక హంగులతో నిర్మించనున్నట్లు వెల్లడించారు.