గుర్గావ్ లో దారుణం: టెక్కీపై దాడి చేసి ఐఫోన్ ఎత్తుకెళ్లిన దుండగులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Gurugram

గుర్గావ్ లోని సెక్టార్ ఇరవై తొమ్మిది ప్రాంతంలో స్నేహితుల కోసం ఎదురుచూస్తున్న వైభవ్ వర్మ అనే ఉద్యోగిపై ఇద్దరు దుండగులు మోటార్ సైకిల్ పై వచ్చి దాడి చేశారని పోలీసులు తెలిపారు. అడ్డుబోయిన బాధితుడి ముఖంపై పదునైన ఆయుధంతో గాయపరిచి ఐఫోన్ పదిహేడును ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ పుటేజీల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు వెల్లడించారు.