'నూతన బోర్డు ఏర్పాటు': సెన్సార్ బోర్డుని పునర్వ్యవస్థీకరించిన కేంద్ర ప్రభుత్వం
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
సెన్సార్ బోర్డుని కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. 18 మంది సభ్యులతో నూతన బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఎఫ్‌సీ ఛైర్మన్ శశి శేఖర్ వేంపటి నేతృత్వంలో నూతన బోర్డు పని చేస్తుందని అందులో పేర్కొంది. ఈ ప్యానెల్ మూడేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నూతన బోర్డులో బాలీవుడ్ నటులు ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టి, టాలీవుడ్ నిర్మాత సుప్రియ యార్లగడ్డ తదితరులు సభ్యులుగా ఉన్నారు.