ప్రకాశం జిల్లాలో వైభవంగా వినాయక చవితి వేడుకలు

రిపోర్టర్: విజయ్ స్థలం: ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లా ఒంగోలులో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంగు తోటలో పార్వతీ పరమేశ్వరుల చుట్టూ వినాయకుడు ప్రదక్షిణలు చేస్తున్నట్టు ఏర్పాటు చేసిన మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దక్షిణం బజార్‌లో రెండు లక్షల పదకొండు వేల పెన్నులతో 42 అడుగుల ఎత్తులో తీర్చిదిద్దిన మహా గణపతి విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ వెరైటీ గణనాథులను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.