పీఎం కిసాన్ తప్పుడు ప్రచారాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం తదుపరి విడత తేదీ మరియు ఆర్థిక సహాయం పెంచారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. వదంతులను నమ్మవద్దని కోరుతూ అధికారిక ఎక్స్ ఖాతాలో వీడియోను విడుదల చేశారు. లబ్ధిదారులు ఈ-కేవైసీతో పాటు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు.