బెల్ట్ దుకాణాలను నిషేధించాలంటూ సర్పంచ్‌కు గ్రామస్థుల విజ్ఞప్తి
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న బెల్ట్ మద్యం దుకాణాలను తక్షణమే నిషేధించాలని గ్రామస్థులు సర్పంచ్ కాకి శ్రీలత సుందర్, పంచాయతీ కార్యదర్శి పద్మజకు వినతిపత్రం అందజేశారు. బెల్ట్ షాపుల వల్ల పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతూ తీవ్ర గొడవలు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి మద్యం అక్రమ విక్రయాలు అరికట్టాలని డిమాండ్ చేశారు.