ఒడిశాలో భారీ జూద శిబిరం గుట్టురట్టు: అరెస్టయిన ఏపీ జూదరులు
రిపోర్టర్: మహేష్
స్థలం: శ్రీకాకుళం
ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడిలో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భారీ జూద శిబిరం గుట్టురట్టయింది. ఈ దాడిలో మొత్తం (71) మంది జూదరులను అరెస్ట్ చేసినట్లు ఒడిశా పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన వారిలో నూటికి తొంబై శాతం మంది, అంటే అరెస్ట్ అయిన వారిలో (67) మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే ఉండటం గమనార్హం. వీరిలో ఒక్క శ్రీకాకుళం జిల్లా వాసులే (36) మంది ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. జూద నిర్వాహకుల నుంచి కోటి రూపాయలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.