ఆదివారం భారత్ నాలుగు వేర్వేరు కీలక మ్యాచ్‌ల్లో బరిలోకి!
రిపోర్టర్: విజయ్
స్థలం: India
క్రీడాభిమానులకు రేపు సూపర్ సండే కానుంది. భారత జట్లు ఒకే రోజు నాలుగు వేర్వేరు మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20, శ్రీలంకతో మహిళల ఆసియా కప్ ఫైనల్ జరగనున్నాయి. అలాగే జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో పురుషుల, మహిళల జట్లు కూడా దక్షిణ కొరియాతో టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి.