తీవ్ర వాయు కాలుష్యం: దిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత
రిపోర్టర్: రాము
స్థలం: దిల్లీ
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి పడిపోయింది. గత వారం కురిసిన వర్షాలతో కాస్త ఊరట లభించినప్పటికీ, సోమవారం నాటికి గాలి నాణ్యత సూచి 307కి చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెల్లడించారు. నగరంలో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్ లో దీపావళి పండగ నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.